బిగ్ ట్విస్ట్ : రియాతో బ్రేకప్ తర్వాతే సుశాంత్ ఆత్మహత్య


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు సీబీఐ విచారణలో షాకింగ్ ట్విస్టులు వచ్చిపడుతున్నాయి. గత రెండ్రోజులుగా సీబీఐ అధికారులు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్థిని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం విచారణలో సీబీఐ అధికారులు అడిగిన దాదాపు 50 ప్రశ్నలకి టకటకా సమాధానాలు చెప్పిందట.

అయితే రెండు ప్రశ్నలకి మాత్రం రియా సమాధానాలు దాటవేసినట్టు తెలిసింది. అందుకే ఆమెని ఈరోజు (సోమవారం) కూడా విచారించనున్నారు. ఇంతకీ రియా సమాధానం చెప్పని ఆ రెండు ప్రశ్నలు ఏంటీ అంటే… ? జూన్ 8న సుశాంత్‌తో బ్రేక‌ప్ చేసుకున్నాకే అత‌ని ఇంటి నుంచి వెళ్లిపోయారా?, జూన్ 8 నుంచి 14 తేదీల మ‌ధ్య అతని కోసం మీరేమైనా ప‌ట్టించుకున్నారా? లేదా?అన్నవాటికి రియా సమాధానం చెప్పలేదని తెలుస్తొంది. దీనిని బట్టీ సుశాంత్ కి రియా బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత జరిగిన పరిణాలు ఏంటీ ? రియాతో బ్రేకప్ బాధని తట్టుకోలేకే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారా ? అన్నది సీబీఐ పూర్తి విచారణలో తేలనుంది.