ఆన్‌లైన్‌ రమ్మీపై ఏపీ ప్రభుత్వం నిషేధం


ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారమ్. ఆన్ లైన్ గ్లాంబ్లింగ్ ఘటనకి చెక్ పెట్టేందుకు ఆన్ లైన్ రమ్మీని నిషేంధించాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రణాళీకలు సిద్ధం చేస్తోంది. ఇటీవల రమ్మీ మోసాలు బాగా పెరిగిపోవడంతో పాటు సైబర్ క్రైం నేరాలు కూడా ఎక్కువైపోయాయి.

ఎంతోమంది బాధితులు తమ డబ్బును పోగొట్టుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఏపీ ప్రభుత్వం దీనిపై ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఓ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఏపీలో మద్యం కట్టడి చర్యల్లో భాగంగా వాటి ధరలని భారీగా పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.