కరోనా వాక్సిన్ అత్యవసర అనుమతులపై WHO కామెంట్
కరోనా వైరస్ కి వాక్సిన్ ని కనుగొనే ప్రయత్నంలో ప్రపంచదేశాలున్నాయి. పరిశోధనలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి అత్యవసర అనుమతులు ఇవ్వాలని అమెరికా అభిప్రాయపడింది. అయితే దీనిపై WHO అభ్యంతరం వ్యక్త ం చేసింది. దీని వలన నష్టాలు ఉంటాయని హెచ్చరించింది.
వేగవంతంగా వ్యాక్సిన్ ఆమోదించడం వల్ల పలు ప్రమాదాలున్నాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ‘వీటిలో మొదటది.. ఇలాంటి క్లినికల్ ట్రయల్స్‌ను మున్ముందు కొనసాగించడం కష్టమవుతుంది. రెండోది, తగినంత అధ్యయనం పూర్తికాని వ్యాక్సిన్ వల్ల అది పనిచేసే సామర్థ్యం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో వైరస్‌ను పూర్తిగా అంతంచేయకపోగా తీవ్రత పెరగడానికి కారణమవుతుంది’ అని సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు.