కర్ణిసేన విధ్వాంసాన్ని ఆపలేరా ?
భన్సాలీ “పద్మావత్” సినిమాను రాజ్ పుత్ కర్ణిసేన మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఈ సినిమా విడుదలకు కోర్టు, సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. కర్ణిసేన మాత్రం కరుణ చూపడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ‘పద్మావత్’ సినిమా విడుదలని ఆపుతామని హెచ్చరిస్తోంది. దానికి తగ్గట్టుగానే రాజస్థాన్, గురజాత్, ఉత్తరప్రదేష్, మధ్య ప్రదేష్ రాష్ట్రాల్లో కర్ణిసేన కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు.
‘పద్మావత్’ సినిమా కష్టాలన్నీ దాటుకొని రేపు (జనవరి 25) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ముంబైలో బాలీవుడ్ సెలబ్రేటీల కోసం వేసిన స్పెషల్ లో సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. పద్మావత్.. ఓ మాస్టర్ పీస్. అద్భుతం అంటున్నారు. దీంతో పాటు ఎలాంటి వివాదాలకి సినిమాలో తావులేదని చెబుతున్నారు. అలాంటి సినిమాని కర్ణిసేన అడ్డుకొంటుంటే ప్రభుత్వాలు ఏం చేస్తుంది.
ముఖ్యంగా భాజాపా పాలిత ప్రాంతాల్లోనే కర్ణిసేన విధ్వంసం కనబడుతోంది. ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని.. ఓ రిలీజ్ అన్నీ అనుమతులు తెచ్చుకొన్న ఓ సినిమాని బలి చేయడం ఎంతవరకు సమంజసం. ఏకంగా ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ లోనే ఈ రకమైన విధ్వాంస కాండ ప్రజాస్వామ్య దేశంలో మంచిది కాదేమో.. !