బన్నీకి థ్యాంక్స్ చెప్పిన పవన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అల్లు అర్జున్ కి థ్యాంక్స్ చెప్పారు. బన్నీది గొప్ప మనసు అని మెచుకున్నారు. పవన్ బర్త్ డే వేడుకల్లో విషాదమ్ నెలకొన్న సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి చిత్తూరు జిల్లా శాంతిపురంలో ఫెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు పవన్ అభిమానులు మృతి చెందారు. అయితే అభిమానుల కుటుంబాలని ఆదుకోవడంలో మెగా ఫ్యామిలీ ఐక్యత చూపిందింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానుల కుటుంబాలకి ఆర్థిక సాయం ప్రకటించారు. 

ఒక్కో కుటుంబానికి చరణ్ రూ. 2.5లక్షలు, బన్నీ రూ. 2లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. వకీల్ సాబ్ నిర్మాణ స్థంస్థలు చెరో రూ.2లక్షల ఆర్థికసాయం ప్రకటించాయి. జనసేన పార్టీ తరుపున ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 2లక్షల సాయం అందనుంది. అభిమానుల కోసం ఆర్థిక సాయం చేసిన బన్నీని అభినందిస్తూ పవన్ ట్విట్ చేశారు. దీనికి బన్నీ థ్యాంక్స్ బాబాయ్ అంటూ రిప్లై ఇచ్చారు. ఆ ఘటన నిజంగా కలిచివేసిందన్నారు.