తెలంగాణ ఎంసెట్ : ఆన్ లైన్ లో హాట్ టికెట్స్

ఈ నెల 9 నుంచి 14 వరకు తెలంగాణ ఎంసెట్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. నేటి నుండి ఈనెల7 వతేది వరకు www.eamcet.tsche.ac.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని జేఎన్టీయూ కన్వీనర్ తెలిపారు.  పరీక్ష కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు మాస్కులు దరిస్తూ,డిస్టెన్స్ తప్పనిసరిగా పాటిస్తూ సానిటైజర్ వాడాలని ఈ సంద‌ర్భంగా సూచించారు.

సెప్టెంబ‌ర్ 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్ లల్లో పరీక్ష జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం తెలంగాణ లో 79 , ఏపీలో 23పరీక్ష కేంద్రాల‌తో మొత్తం 102 సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ ఎంసెట్ ఎగ్జామ్ ను 1లక్ష 43 వేల 165 మంది ప‌రీక్ష రాయ‌నున్నారు.