సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్‌కు మరో షాక్

హైకోర్ట్ స్టే విధించిన అంశాలపై ఏపీ సర్కార్ సుప్రీంకు వెళ్లడం.. అక్కడ నిరాశ ఎదురవుతుండటం కామన్ అయిపోయింది. ఆంగ్లమాధ్యమం విషయంలో హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది.

ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం 81, 85 జీవోలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్లమాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయడం సరికాదని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌పై స్పందించేందుకు నోటీసులు ఇస్తామని చెప్పింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 25కి వాయిదా వేసింది.