#IPL2020 షెడ్యూల్ ఖరారు


దుబాయ్ వేదికగా ఈ నెల 19 నుంచి ఐపీఎల్-2020 ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ షెడ్యూల్ ని ఇంకా బీసీసీఐ విడుదల చేయలేదు. తాజాగా దీనిపై బీసీసీ అధ్యక్షుడు గంగూలీ స్పందించారు. ఇప్పటికే ఐపీఎల్ షెడ్యూల్ విడుదల విషయంలో ఆలస్యం అయింది. రేపు (సెప్టెంబర్ 4)న ఐపీఎల్-2020 షెడ్యూల్ ని రిలీజ్ చేస్తామని తెలిపారు.

వాస్తవానికి షెడ్యూల్ రిలీజ్ చేయకుండానే ఐపీఎల్ నిర్వహిద్దామనుకున్నారు. దీంతో ప్రతి మ్యాచ్ సస్పెన్స్ ఉంటుందని భావించారు. అయితే షెడ్యూల్ రిలీజ్ చేయకుండా మ్యాచ్ లు నిర్వహిస్తే కన్పూజన్ ఉంటుందని షెడ్యూల్ రెడీ చేశారు. రేపు రిలీజ్ చేయనున్నారు. 

ఇక మెగా టోర్నీకి ముందు వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల 11 మంది చెన్నై ఆటగాళ్లు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. వారు కోలుకున్నారు. తాజాగా బీసీసీఐ వైద్య సిబ్బంది కరోనా బారిపపడ్డారు. మొత్తానికి.. ఐపీఎల్ 2020కి సంబంధించి ఎప్పుడు ఏ షాకింగ్ న్యూస్ వినాల్సి వస్తుందో అనే ఆందోళన కలుగుతోంది.