పవన్ ఏ హీరోయిన్ ని వదల్లేదు

టైటిల్ ని చూసి తప్పుగా అనుకునేరూ ! కొత్త పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కనిపిస్తున్నారు. నిన్న పవన్ 49వ పుట్టినరోజుని జరుపుకున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలంతా పవన్ కి శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు వారికి పేరు పేరున కృతజ్ఝతలు చెబుతున్నారు పవన్. ఈ ఉదయం నుంచి అదే పనిలో ఉన్నారు. ఏ ఒక్కరిని వదలడం లేదు. యువ హీరోలు, హీరోయినలు, చిన్నా-పెద్దా తేడా లేకుండా అందరికి కృతజ్ఝతలు తెలిపుతున్నారు. పేరు పేరున పలకరిస్తున్నారు.

పవర్ స్టార్ నుంచి రిప్లై రావడంతో… ఆ ఆనందాన్ని తట్టుకోవడం లేదు. సత్యదేవ్.. లవ్ లో ఇది బెస్ట్ మూమెంట్ అని మురిసిపోయారు. బర్నింగ్ స్టార్ సంపూ ఏకంగా పవన్ రిప్లై ని ఫోటో ఫ్రేమ్ చేయించుకుంటానన్నారు. హీరోయిన్స్ రకుల్, పాయల్, రకుల్, కీర్తి సురేష్, కాజల్, తమన్నా.. ఇలా ప్రతి ఒక్కరికి పవన్ రిప్లై ఇచ్చారు. ఏ ఒక్క హీరోయిన్ ని వదల్లేదు అన్నమాట.

ఇక పవన్ బర్త్ డే కానుకగా అభిమానులకి బహుమతులు క్యూ కట్టాయి. వకీల్ సాబ్ నుంచి మోషన్ పోస్టర్, పవన్-క్రిష్ సినిమా ప్రీ లుక్, పవన్-హరీష్ సినిమా కాన్సెప్ట్ పోస్టర్లు వచ్చాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ నటించనున్న సినిమా ప్రకటన వచ్చేసింది. వాటితో పవన్ ఫ్యాన్స్ కడుపునిండిపోయింది. అంతేకాదు.. ఇక పవన్ ఫుల్ టైమ్ సినిమాలు చేయబోతున్నారనే క్లారిటీ వచ్చేసింది.