32యేళ్ల యువతిపై 19యేళ్ల యువకుడు అత్యాచారం
పెళ్లికాని 32ఏళ్ల యువతి వెంట 19యేళ్ల యువకుడు పడ్డాడు. యేడాదిగా ప్రేమిస్తున్నాని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇటీవల పెళ్లికి నిరాకరించాడు. దీంతో బాధిత యువతి పోలీసులకి ఫిర్యాదు చేసింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.నిందితుడిని గురువారం రిమాండ్‌కు తరలించామని ఇన్‌స్పెక్టర్ భాస్కర్ పేర్కొన్నారు.