బ్రేకింగ్ : రియా ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి చూసిన సంగతి తెలిసిందే. డ్రగ్‌ డీలర్‌ విలాత్ర మత్తుమందును రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌తోపాటు సుశాంత్‌ మేనేజర్‌ సామ్యూల్‌ మిరిండాకి సరఫరా చేసేవాడని అధికారులు గతంలోనే తేల్చారు. మత్తుమందు సరఫరా కేసులో ఎన్‌సీబీ ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేసింది.

డ్రగ్‌ డీలర్‌ జైద్‌ విలాత్రకు రియాతోపాటు ఆమె తమ్ముడు షోవిక్‌కు సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఈనేపథ్యంలోనే శుక్రవారం ఉదయం ముంబయిలోని నటి ఇంటికి చేరుకున్న ఎన్‌సీబీ బృందం ఆకస్మిక సోదాలు చేపడుతోంది. అంతకుముందు సుశాంత్‌ సహాయకుడి ఇంట్లో సోదాలు చేపట్టింది.   

జూన్‌ 14వ తేదీన సుశాంత్‌సింగ్‌ ముంబయిలోని తన ఫ్లాట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పలు నాటకీయ పరిణామాల అనంతరం ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. రాజ్‌పుత్‌ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రియురాలు రియా చక్రవర్తిని సీబీఐ నాలుగు రోజులపాటు విచారించింది. ఆమె సోదరుడు షోవిక్‌తోపాటు పలువురిని ప్రశ్నించి, కీలక ఆధారాలు కేసరించింది.