ఐపీఎల్’కు అంపైర్ల షాక్

ఐపీఎల్-20 విషయంలో బీసీసీఐకి మరో సమస్య వచ్చిపడింది. ఈ ఏడాది ఐపీఎల్ లో విధులు నిర్వర్తించేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఎలైట్‌ ప్యానెల్‌ అంపైర్లు సిద్ధంగా లేరు. ప్రతి ఏడాది ఈ ప్యానెల్‌ కు చెందిన ఆరుగురు అంపైర్లలను ఐపీఎల్ కోసం బీసీసీఐ తీసుకుంటుంది. కానీ ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువ మందిని తీసుకోవాలని బీసీసీఐ ప్లాన్ చేసి వారిని సంప్రదించగా… అందులో కేవలం నలుగురు మాత్రమే ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.

మరోవైపు మెగా టోర్నీకి ముందు ఏ ఆటగాడు ఎప్పుడు కరోనా బారినపడతాడో ? అన్న ఆందోళన కలుగుతొంది. చెన్నై సూపర్ కింగ్స్ కి చెందిన 13 మంది ఆటగాళ్లు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. వీరిలో 11మంది ఇప్పటికే కోలుకున్నారు. మరోవైపు సురేష్ రైనా, లసిత్ మలింగ్ వ్యక్తిగత కారణాల వలన ఐపీఎల్ కు దూరమైన సంగతి తెలిసిందే.