బ్రేకింగ్ : హరీష్ రావుకు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంత్రి హరీష్ రావు ట్విట్ చేశారు. ‘తనకి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉంది. ఇటీవల తనని కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలి’ అని హరీష్ సూచించారు.

దీంతో ఎల్లుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకి మంత్రి హారీష్ దూరం కానున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలకి కరోనా రిపోర్ట్ తో రావాలి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించిన సంగతి తెలిసిందే. నెగటివ్ వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. 20 నుంచి 21 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాటు చేశామని స్పీకర్ తెలిపారు.

ఇక తెలంగాణలో గడచిన 24 గంటల్లో  2,511 కొత్త‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,38,395కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 877కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనా బారి నుంచి 2,579 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,04,603కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 32,915కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.