ప‌డి ప‌డి లేచె (శర్వా) మ‌న‌సు !

ఫుల్ ఫాంలో ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్. గత యేడాది శతమానం భవతి, మహానుభావుడు సినిమాలతో హిట్స్ కొట్టాడు. ఈ యేడాది కూడా ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నారు. ఈ యంగ్ హీరో హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా కోసం ఓ రొమాంటిక్ టైటిల్ వినిపిస్తోంది.

ఈ చిత్రానికి “ప‌డి ప‌డి లేచె మ‌న‌సు” అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ట‌. దాదాపుగా ఈ టైటిల్ ఫైనల్ అయినట్టేనని చెబుతున్నారు. ఇదో రొమాంటిక్ ల‌వ్ స్టోరీ. ట్రీట్‌మెంట్ మాత్రం చాలా కొత్త‌గా ఉండ‌బోతోంద‌ని చెబుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు.