కొత్త పార్టీ పెట్టబోతున్న రేవంత్ రెడ్డి ? అందుకే సర్వేలు చేస్తున్నారా ??

తెలంగాణ పీసీసీ పోస్ట్ కోసం ఎంపీ రేవంత్ రెడ్డి గట్టిపోటీ ఇస్తున్నారు. గతంలోనే రేవంత్ రెడ్డికి పీసీసీ ఫోస్ట్ ఖాయమైంది. కానీ ఆయన అభ్యర్థిత్వాన్ని సీనియర్లు వ్యతిరేకించడంతో.. అధిష్టానం హోల్డ్ లో పెట్టేసిందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ తనకి పీసీసీ పదవి రాకపోతే.. ప్లాన్ -బి రెడీ చేసుకుంటున్నారట రేవంత్ రెడ్డి. అదే కొత్త పార్టీ ఏర్పాటు.

అవునూ.. ఇందుకోం ఇటీవల సర్వేలు కూడా చేయిస్తున్నారని టాక్. తెలంగాణలో తెరాసకి ప్రత్యామ్నాయం కరువైంది. కాంగ్రెస్, బీజేపీలు తెరాసని ఢీకొనలేకపోతున్నాయ్ అనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారు. దానికి తెరాసకు ప్రత్యామ్నాయంగా రెడీ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. మరీ.. ఈ ప్రచారంలో నిజమెంత ? అనేది కాలమే చెప్పాలి.