కేసీఆర్’కు థ్యాంక్స్ చెప్పిన బాలయ్య

తెలంగాణ సీఎం కేసీఆర్’కి కృతజ్ఝతలు చెప్పారు నందమూరి బాలకృష్ణ. తెలంగాణ పదో తరగతి పరీక్షా సెలబస్ లో ఎన్ టీఆర్ పాఠ్యాంశాన్ని చేర్చిన సంగతి తెలిసిందే. సాంఘిక శాస్త్రంలో 268 పేజీలో ఎన్టీఆర్ కి సంబంధించిన జీవిత విశేషాలను అందులో పొందుపరిచారు. దీనిపై తెదేపా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాలయ్య తన ఫేస్ బుక్ ఖాతాలో సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్జతలు తెలిపుతూ.. పోస్ట్ పెట్టారు.

“కళకి, కళాకారులకి విలువ పెంచిన కథానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని దిల్లీ పీఠాన్ని కదిలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మద్రాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ మా నాన్నగారు నందమూరి తారక రామారావు. భవిష్యత్తు తరాలకి స్ఫూర్తినిచ్చేలా ఆయన గురించి 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు” అని బాలయ్య రాసుకొచ్చారు.

కళకి, కళాకారులకి విలువను పెంచిన కధానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదలించేలా వినిపించిన మహానాయకుడు,…

Posted by Nandamuri Balakrishna on Friday, 4 September 2020