బాబోయ్.. ఒక్కరోజే లక్ష కరోనా కొత్త కేసులు !

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇకపై ప్రతిరోజూ లక్ష కొత్త కరోనా కేసులు నమోదయ్యేలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 90,632  కరోనా కేసులు నమోదయ్యాయ్. దీంతో ఆదివారం నాటికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 41లక్షలకు (41,13,811) చేరింది. నిన్న ఒక్కరోజే మరో 1065 మంది కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆదివారం నాటికి దేశంలో కరోనాతో మరణించిన వారిసంఖ్య 70,626కు చేరింది.

కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నా.. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది.  నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 73వేల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతం దాటింది. ప్రస్తుతం కొవిడ్‌ మరణాల రేటు 1.7శాతంగా కొనసాగుతోంది. కొవిడ్‌ మరణాల్లో భారత్‌ ప్రపంచంలోనే మూడోస్థానంలో ఉంది. కరోనా కేసుల్లోనూ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌కు భారత్‌ చేరువయ్యింది. బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 41లక్షల 23వేల కేసులు నమోదయ్యాయి.