నూతన్ నాయుడు పెద్ద చీటర్
బిగ్ బాస్ ఫేస్ నూతన్ నాయుడు గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన పెద్ద చీటర్ ని పోలీసుల దర్యాప్తుతో తేలింది. శిరోముండనం కేసులో నూతన్ నాయుడుని శనివారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని ఉడిపిలో ఆయన్ని అదుపులోనికి తీసుకున్నారు.
అక్కడి నుంచి అర్ధరాత్రి విశాఖ తీసుకొచ్చిన పోలీసులు కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నూతన్ నాయుడిని అనకాపల్లి సబ్‌జైలుకు తరలించారు.
శిరోముండనం కేసులో తన భార్య మధుప్రియని కాపాడటానికి నూతన్ నాయుడు ఫేక్ కాల్స్ చేశాడట. ఐఏస్ పేరుతో పలువురి అధికారులకి ఫోన్ చేశారని పోలీసులు తెలిపారు. గతంలోనూ పలువురు అధికారుల పేరుతో నూతన్ నాయుడు ఫేక్ కాల్స్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆయన ఫోన్ నెంబర్ ని స్వాధీనం చేసుకొన్నారు. గతంలో ఆ నెంబర్ నుంచి 76 కాల్స్ చేశారట. మొత్తంగా సామాన్యుడు నుంచి సెలబ్రిటీగా మారిన నూతన్ నాయుడు పెద్ద చీటర్ అని తేలిపోయింది.