బ్రేకింగ్ : తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు
రెవెన్యూ శాఖని పూర్తిగా ప్రక్షణాళన చేసే పనిని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తోంది. అయితే తాజా సమాచారమ్ ప్రకారం వీఆర్వో వ్యవస్థ రద్దుకి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
వీఆర్వోల నుంచి రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులు స్వాధీనం చేసుకోవాలి. సాయంత్రం 5 గంటల కల్లా రిపోర్ట్ పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. అంతేకాదు.. దీనికి సంబంధించిన బిల్లుని కూడా తాజా అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి.. ఆమోదించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ఈ వ్యవహారాన్ని అంతా ప్రభుత్వం చాలా సీక్రెట్ గా చేయడం విశేషం. వీఆర్ వో వ్యవస్థ రద్దు అనే విషయం ఎక్కడా పొక్కనివ్వలేదు. ఇంత సీక్రెట్ గా చేయాల్సిన పని ఏమొచ్చింది ? వీఆర్ వీవో వ్యవస్థని రద్దు చేసిన ప్రభుత్వం.. వారిని ఏ శాఖ కింద చేరుస్తారు? వారికే ఏ ఉద్యోగాలు కల్పిస్తారు ?? అన్నది చర్చనీయాంశంగా మారింది. తమకు క్లారిటీ ఇవ్వాలని వీఆర్ వోలు కోరుతున్నారు.