తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయాలు
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినేట్ భేటీ జరిగింది. కొత్త రెవెన్యూ బిల్లుకు ఆమోదంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకొంది కేబినేట్
తెలంగాణ కేబినేట్ నిర్ణయాలు :
* రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దు
* టీఎస్ బీపాస్, తెలంగాణ మున్సిపాలిటీ చట్టం-2019 సవరణ
* తెలంగాణ జీఎస్టీ చట్టం-2017, తెలంగాణ సివిల్ కోర్టు చట్టం-1972 బిల్లులకు ఆమోదం
* తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం సవరణ ఆర్డినెన్స్-2020
* తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్-2020
* తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్లు-2020లకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది.
* ఆయుష్ వైద్య కళాశాలల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్స్‌ను ఆమోదం
* తెలంగాణ కోర్టు ఫీజు, సూట్స్ వాల్యుయేషన్ చట్టం-1956 సవరణ బిల్లుకు ఆమోదం
* కొత్త సచివాలయ నిర్మాణం, పాత సచివాలయం కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులకు ఆమోదం
*17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలంటూ బీసీ కమిషన్ చేసిన సిఫార్సులకు ఆమోదం