ఇలా అయితే ఎలా బిగ్ బాస్ ?


కరోనా టైమ్ లో ప్రేక్షకులకి ఎంటర్  టైన్ మెంట్ కరువైంది. సరిగ్గా ఇలాంటి టైమ్ లో దూసుకొచ్చాడు బిగ్ బాస్. ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఎంటర్ టైన్ మెంట్ తో అంటూ ఊరించాడు. నాగార్జున నమ్మకంగా చెప్పడంతో ప్రేక్షకులు నమ్మారు. కానీ బిగ్ బాస్ 4 మొదలై నాలుగు రోజుల్లోనే బోర్ కొట్టేస్తున్నాడు. కడుపుబ్బ నవ్వుకొనే ఒక్క సీన్ లేదు. ఆకట్టుకొనే ఆట, పాటల్లేవ్.

మొదటి రోజు కంటెస్టెంట్స్ ఎంట్రీకి సరిపోయిద్ది. ఆరోజు షో కాస్త జోష్ గా సాగింది. ఆ తర్వాత రోజు ఇంట్లో మొదటి రోజు కదా. ఇంకా కుదురుకోవాలి అనుకొన్నారు. మంగళ, బుధ వారాల్లో అయితే షో చాలా చప్పగా సాగింది. అందరికి కంటే గంగవ్వనే బెటర్ అనిపించుకొంటోంది. ఆమె పంచ్ లేస్తేనే ప్రేక్షకులు కాస్త నవ్వుతున్నారు. రిలీఫ్ అవుతున్నారు. స్టార్ మా ప్రోమోల్లోనూ గంగవ్వని నమ్ముకుంటుంది అంటే.. మిగితా కంటెస్టెంట్స్ ఎంత వీక్ గా ఉన్నారన్నది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు.

సూర్యకిరణ్, అమ్మ రాజశేఖర్, దివి, మెహబూబ్ నుంచి ఎలాంటి ఎంటర్ టైన్ మెంట్ ఆశించవద్దు అన్నట్టుగా ఉంది. గంగవ్వ, నోయల్, అభిజిత్ లు మాత్రమే కాస్త స్క్రీన్ పై గ్లో అవుతున్నారు. లాస్య, జోర్థార్ సుజాత.. ఇప్పటి నుంచే ఎందుకులే అన్నట్టుగా ఉన్నారు. ఇక మోనాల్ గుజ్జర్ ఏడిస్తూ, తింటూ మాత్రమే కనిపిస్తున్నారు. ఇలా అయితే కష్టం.. బిగ్ బాస్ బోర్  కొట్టేస్తున్నాడని ప్రేక్షకులు అంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఈ నెల 19 నుంచి ఐపీల్ పండగ మొదలు కానుంది. ఆ పోటీని తట్టుకొని బిగ్ బాస్ షో నిలబడాలంటే.. డోస్ పెంచాల్సిందే.