17యేళ్ల వయసులో ఆ దర్శకుడు వేధించాడు.. దుస్తులు విప్పమన్నాడు !
భారత్‌లో రెండేళ్ల క్రితం ‘మీటూ’ ఉద్యమం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ముగ్గురు మహిళలు బాలీవుడ్ దర్శకుడు సాజిద్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. తాజాగా ప్రముఖ మోడల్ పాలా సాజిద్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసింది. 17యేళ్ల వయసులో తనని సాజిద్ దుస్తులు విప్పమన్నాడు. దారుణంగా మాట్లాడారని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
‘నా 17 ఏళ్ల వయసులో సాజిద్ ఖాన్ నన్ను లైంగికంగా వేధించాడు.ఆయన నాతో చాలా అసహ్యంగా మాట్లాడారు. నన్ను ముట్టుకునేందుకు ప్రయత్నించాడు. అంతేకాదు తన సినిమా ‘హౌస్‌ఫుల్’లో నటించే అవకాశం ఇవ్వాలంటే.. తన ముందు దుస్తులు విప్పాలని అడిగాడు. ఆయన ఇంత దారుణంగా ఎంత మంది అమ్మాయిలతో ప్రవర్తించాడో ఆ దేవుడికే తెలియాలి. ఈ విషయం మీటూ సమయంలో ఎందుకు చెప్పలేదు అంటే.. ? కుటుంబ సభ్యుల్ని పోషించడానికి డబ్బులు సంపాదించాల్సిన బాధ్యత నాపై ఉండటంతో మౌనంగా ఉన్నా. కానీ ఇప్పుడు నేనే స్వయంగా సంపాదిస్తున్నా.అందుకే చెప్పే ధైర్యం నాకు వచ్చింది’ అని రాసుకొచ్చింది.