తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్స్‌ను నిలిపివేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. శనివారం కొత్త రెవెన్యూ చట్టంపై అసెంబ్లీలో విస్తృత చర్చ జరింగింది. సభ్యులు సూచనలు,సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. శనివారం (రేపటి) నుంచి దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్స్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
వక్ఫ్ భూముల్లో లావాదేవీలు జరగకుండా ఆటోలాక్ చేస్తామన్నారు. ఆలయ భూములను పరిరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నూతన చట్టం రెవెన్యూ సంస్కరణలో తొలి అడుగు మాత్రమే. పలు చట్టాల సమూహారంగా కొత్త రెవెన్యూ చట్టం కొనసాగుతుందన్నారు. ధరణి ఒక్కటే కాదనీ, మిగిలిన చట్టాలు కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు.