గుడ్ న్యూస్ : ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజేనతర రైతులకి కూడా రైతుబంధు
కొత్త రెవెన్యూ చట్టంపై తెలంగాణ అసెంబ్లీలో విస్తృత చర్చ సాగుతోంది. సభ్యులు అడిగిన ప్రశ్నలు, సందేహాలు, సలహాలపై స్వయంగా సీఎం కేసీఆర్ సమాధానాలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజేనతర రైతులకి కూడా రైతుబంధు ఇవ్వాలని సభ్యులు కోరారు. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజేనతర రైతులకి రైతుబంధు అందించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఇక ఇప్పటి వరకు 57 లక్షల 90 వేలమంది రైతులకు రైతుబంధు సాయం అందించామన్నారు. కేవలం 28 గంటల్లో రూ. 7,200 కోట్లు రైతులకు అందించగలిగామని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. గ్రామాల్లో ఎవరి జీవితం వారే సాగిస్తున్నారు. గ్రామాల్లో వివాదంలో ఉన్న భూములు చాలా తక్కువ అని సీఎం కేసీఆర్ అన్నారు.