ధరణి పోర్టల్’ని హ్యాక్ చేస్తే పరిస్థితి ఏంటీ ?
తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వీఆర్ వో వ్యవస్థని రద్దు చేసింది. కొత్త రెవెన్యూ చట్టంలో ఆన్ లైన్ కి పెద్ద పీఠ వేసింది. అంతా ఆన్ లైన్ లోనే జరిగేలా.. ధరణి పోర్టల్ ని తీసుకొచ్చింది. అయితే ధరణి పోర్టల్ హాక్ కి గురైతే పరిస్థితి ఏంటీ ? ని ఇవాళ్టి శాసనసభ చర్చలో భాగంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన చట్టం రెవెన్యూ సంస్కరణలో తొలి అడుగు మాత్రమేనని సీఎం కేసీఆర్ అన్నారు. కొత్త చట్టం తీసుకొచ్చిన.. రికార్డులన్నీ ఉంటాయని తెలిపారు. పీటముడి పడి పరిష్కారం దొరకని అనేక సమస్యలకు కూడా త్వరలోనే పరిష్కారం చూపుతామని తెలిపారు. పలు చట్టాల సమూహారంగా కొత్త రెవెన్యూ చట్టం కొనసాగుతుందని పేర్కొన్నారు.