పెళ్లి చేసుకొని.. మొగుడ్ని దాచిపెట్టిన హీరోయిన్ !

ఆ హీరోయిన్ యేడాది క్రితమే పెళ్లి చేసుకొంది. అయితే ఆ విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్తపడింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. మొగుడ్ని దాచిపెట్టింది. పెళ్లయింది అని తెలిస్తే సినిమా ఆఫర్లు తగ్గుతాయానా ? ఇంకేమనా కారణాలున్నాయా ?

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?సంజనా గల్రానీ. శాండల్‌వుడ్‌లో డ్రగ్స్‌ కేసులో అరస్టై జైలులో ఊచలు లెక్కపెడుతున్న సంజన గురించి షాకింగ్ విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి.ఈ కేసులో విచారణ సందర్భంగా సీసీబీ పోలీసులు.. మీకు పెళ్లైందా ? అని సంజనాని ప్రశ్నించారు. లేదు.. ఐయామ్ స్టిల్ సింగిల్ అని సమాధానం ఇచ్చింది. అయితే ఆమె పెళ్లి ఫోటోని పోలీసులు చూపడంతో సంజన్ షాక్ అయినట్టు తెలుస్తోంది. మీకు పెళ్లైంది. ఆ విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు ? అడిగితే.. సంచన నుంచి ఆన్సర్ రాలేదని తెలుస్తోంది.

ఇక ఈ కేసు విచారణలో సంజనా షాకింగ్ విషయాలు బయటపెట్టినట్టు సమాచారమ్. సినీ, సీరియల్, రాజకీయ, వ్యాపార రంగాలకి చెందిన ప్రముఖుల పేర్లని సంచన చెప్పినట్టు తెలుస్తోంది. ఓ 50 మంది పేర్లని సంజన చెప్పినట్టు తెలిసిందే. ఇప్పుడు వారందరిని విచారించే ప్రయత్నంలో సీబీసీ పోలీసులు ఉన్నటు తెలుస్తోంది.