తిరిగి తెరచుకున్న యాదాద్రి ఆలయం

కరోనా మహమ్మారి దేవుళ్లని కూడా వదలడం లేదు. కరోనా ఎఫెక్ట్ తో ఇటీవల దేశవ్యాప్తంగా దేవాలయాలు రెండ్నెళ్లు మూతపడిన సంగతి తెలిసిందే. తిరిగి తెరచుకున్న తర్వాత కూడా కరోనా ఎఫెక్ట్ తో మూతపడుతున్న దేవాలయాలున్నాయి. ఈ క్రమంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా దేవాలయం గత మూడు రోజులుగా మూతపడింది.

ఆలయం అర్చలకు, ఇతర సిబ్బంది కరోనా బారినపడటంతో ఆలయాన్ని మూసేశారు. మూడ్రోజుల పాటు శానిటైజ్ చేశారు. తిరిగి నేటి నుంచి యాదాద్రి ఆలయం తెరచుకోనుంది. భక్తుల దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత, లఘు దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఇక రేపు సీఎం కేసీఆర్ యాదాద్రికి రానున్నారు. స్వామివారి దర్శనం తర్వాత ఆలయ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.