బిగ్ బాస్ 4.. ప్రోమోస్ చూస్తే సరిపోతుందిగా !

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా తొలివారం పూర్తి చేసుకోనుంది. తొలివారంలో బిగ్ బాస్ ఇంటి నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు ? అన్నది ఆసక్తిగా మారింది. అయితే.. తొలివారం షో అంత రసవత్తరంగా సాగలేదు అన్నది నగ్నసత్యం. గంగవ్వ, నోయల్, దివి లు మాత్రమే కాస్త ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేయగలిగారు.

మిగితావారు ఇప్పుడే ఎందుకే మొదలెట్టడం అన్నట్టుగా ఉంది. మరో విషయం ఏంటంటే.. ? గంటపాటు ఓపిగ్గా బిగ్ బాస్ షో చూడాల్సిన పనిలేదు. షోకి ముందు స్టార్ మా వదిలే ఒకట్రెండు ప్రోమోలు చూస్తే చాలు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ? ప్రోమోలో ఉన్నది మాత్రమే హైలైట్.. మిగితా షో అంతా చూడ్డానికి ఏమీ లేదు అన్నట్టుగా షో సాగుతోంది. దీనిపై బిగ్ బాస్ యాజమాన్యం ఫోకస్ పెట్టింది.. గంట పాటు షో రసవత్తరంగా సాగేలే చూస్తే బెటరేమో !