డార్లింగ్స్.. అప్పుడే వరల్డ్ రికార్డ్ కొట్టేశారు !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ (అక్టోబర్ 23) డే సెలబ్రేషన్స్ అప్పుడే మొదలైపోయాయ్. #41DaysToREBELSTARBDay యాష్ ట్యాగ్ ని వైరల్ చేశారు. 24 గంటల్లోనే 11మిలియన్ వ్యూస్ వచ్చాయ్. ఇది వరల్డ్ రికార్డే. గతంలో మహేష్ బాబు, ఆ తర్వాత పవన్ కల్యాణ్ బర్త్ డే యాష్ ట్యాగ్స్ 24 గంటల్లో 6మిలియన్ పైగా వ్యూస్ సొంతం చేసుకున్నాయి. వరల్డ్ రికార్డ్ కొట్టేశాయి. తాజాగా ప్రభాస్ అభిమానులు అంతకు డబుల్ వ్యూస్ సొంతం చేసుకున్నారు. వరల్డ్ రికార్డ్ కొట్టేశారని చెప్పవచ్చు.

ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ఆదిపురుష్ లో నటిస్తున్నారు. రామాయణ యుద్ధకాండగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో రాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు. రావణాసురుడి పాత్ర కోసం సైఫ్ అలీఖాన్ ని తీసుకున్నారు. ఇక సీత పాత్ర కోసం పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్, కైరా అడ్వానీ, అనుష్క శర్మ పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో సీతగా ఎవరు ఫైనల్ అవుతారన్నది చూడాలి.