TSలో కొత్త కేసుల కంటే రికవరీ ఎక్కువ
తెలంగాణలో కరోనా పెరుగుతోంది. ప్రతిరోజూ 2వేలకు పైగా కొత్త కేసులు, 10కి అటు, ఇటుగా మరణాలు నమోదవుతున్నాయి. అయితే కొద్దిరోజులుగా ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల కంటే.. రికవరీ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇది ఊరటనిచ్చే విషయమని చెప్పాలి. అయితే తెలంగాణ ప్రభుత్వం కరోనా కేసుల విషయంలో తప్పుడు లెక్కలు చూపుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఆ విషయం పక్కనపెడితే.. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 2,216 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాబారి నిన్న ఒక్క రోజే 2,603 మంది కోలుకున్నారు. ఇక మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,57,096కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 961కి చేరింది. కరోనాబారి నిన్న ఒక్క రోజే 2,603 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,24,528కి చేరింది.
ప్రస్తుతం తెలంగాణలో 31,607 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 24,674 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.