యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి సేవలో సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. ముందుగా లక్ష్మీనరసింహా స్వామి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత యాదాద్రి ఆలయం పునర్మాణ పనులని పరీలించనున్నారు. అధికారులతో సమీక్షించనున్నారు. రాత్రి 8గంటల వరకు సీఎం కేసీఆర్ యాదాద్రి కొండపైనే గడపనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ తర్వాత సీఎం కేసీఆర్ ఎక్కువసార్లు యాదాద్రి పర్యటనకే వచ్చారు. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా యాదాద్రి ఆలయాన్ని మొత్తం రాతి రాళ్లతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పలు దఫాలుగా ఆలయ నిర్మాణ పనుల కోసం రూ. 2వేల కోట్లు ప్రభుత్వం కేటాయించనుంది. యాదాద్రి చుట్టూ 80కిలో మీటర్ల మేర టెంపుల్ సిటీని డెవలెప్ చేయనుంది. యాదాద్రి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్ వాటిపై సమీక్ష చేసి.. సలహాలు, సూచనలు చేయనున్నారు.
Live: Honourable CM Sri KCR visit to Yadadri temple. https://t.co/YGdjQwb0Ya
— Telangana CMO (@TelanganaCMO) September 13, 2020