గవర్నర్ వద్దకు కంగనా-శివసేన గొడవ


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అవి కాస్త శివసేన వర్సెస్ కంగనా దిశగా టర్న్ తీసుకొన్నాయి. మహా ప్రభుత్వం కంగనాని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. కంగనా హిమాచల్ నుంచి ముంబైకి వచ్చేలోపు కూల్చివేతలతో స్వాగతం పలికారు. కంగనా ఆఫీసుని కూల్చేశారు. అంతేకాదు.. గతంలో కంగానాపై వచ్చిన పాత డ్రగ్స్ ఆరోపణలు తోడుతున్నారు.

ఈ నేపథ్యంలో కంగనా సోమవారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారిని కలవనున్నారు. ముంబైలోని రాజ్ భవన్‌లో సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ఆమె గవర్నర్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. శివసేనతో వివాదం నేపథ్యంలో ఆమె గవర్నర్‌ను కలవాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ముంబై పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో అనిపిస్తుందని కంగనా చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఆరోపణలు పక్కకుపోయి.. శివసేన వర్సెస్ కంగనా ఏపీసోడ్ హైలైట్ అయింది. అయితే కంగనా వెనక బీజేపీ ఉందని శివసేన ఆరోపిస్తోంది. ఆమెని బలంగా ఢికొట్టేందుకు రెడీ అయింది. కంగనా కూడా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. మరీ.. ఈ వివాదం ఏ తీరానికి చేరుతుందో చూడాలి.