ప్రణబ్’కు పార్లమెంట్ సంతాపం

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో స్పీకర్‌ ఓం బిర్లా ప్రారంభోపన్యాసం చేశారు. ఇటీవల ప్రాణాలు కోల్పోయిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, సిట్టింగ్‌ సభ్యుడు వసంత్‌కుమార్‌ మృతికి సంతాపం తెలిపారు.

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న వేళ.. పటిష్ఠ నిబంధనల నడుమ పార్లమెంట్ సమావేశాలు నడవనున్నాయి. ఈ సమావేశాల్లో చేపట్టిన పలు మార్పులపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సభా సమయం కుదింపు, ప్రశ్న కాలాన్ని రద్దు చేయడం, సూన్య గంట సమయం కుదింపు తదితర అంశాలను అందులో ప్రస్తావించనున్నారు .కరోన మహమ్మారి ప్రభావం, దేశంలో తాజా పరిస్థితిపై ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటన చేయనున్నారు. అంతేకాదు.. భారత్-చైనా ఉద్రిక్త పరిస్థితులపై కూడా ప్రకటన చేస్తారని సమాచారమ్.