దేశంలో 92,071 కొత్త కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 92,071 కేసులు నమోదయ్యాయ్. మరో 1,136 మంది కరోనాతో మృతి చెందారు.  దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 48,46,428కి చేరింది. మరణాల సంఖ్య 79,722కి పెరిగింది.

ప్రస్తుతం దేశంలో 9,86,598 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 37,80,107 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 78 శాతానికి చేరింది. మరణాల రేటు 1.64 శాతంగా ఉంది. 65,19,554 కేసులు, 1,94,073 మరణాలతో అమెరికా తొలిస్థానంలో ఉండగా.. భారత్‌, బ్రెజిల్‌ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.