శ్రావణి ఆత్మహత్య కేసు.. పోలీసులు మీడియాకు వివరించిన షాకింగ్ నిజాలు !

టీవీ నటి శ్రావణి కొండపల్లి ఆత్మహత్య కేసు వివరాలని ఎస్ఆర్ నగర్ పోలీసులు మీడియాకు వివరించారు. నిందితులు సాయికృష్ణారెడ్డి, దేవరాజ్ రెడ్దిలని మీడియా ముందు  హాజరుపరిచారు. సాయికృష్ణారెడ్డి,ఆర్ ఎక్స్ 100 నిర్మాత  అశోక్ రెడ్డి, దేవరాజ్ రెడ్డి… ముగ్గురితో శ్రావణికి సంబంధం ఉందని పోలీసులు తెలిపారు.

2012లో సీరియల్స్ లో నటించేందుకు హైదరాబాద్ కి వచ్చిన శ్రావణికి.. 2017లో సాయికృష్ణారెడ్డి పరిచయం ఏర్పడింది. వీరిద్దరు ప్రేమలో పడ్డారు. కలిసి తిరిగారు. ఇక అశోక్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన సినిమాలో శ్రావణి చిన్ని పాత్రలో నటించింది. వీరిద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. ఇక 2019 ఆగస్టులో దేవరాజ్ రెడ్డితో శ్రావణికి పరిచయం ఏర్పడింది. ఆమెని పెళ్లి చేసుకుంటానని దేవరాజ్ హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత శ్రావణి సంబంధాలు తెలిసి దూరం పెట్టారని పోలీసులు తెలిపారు.

అయితే దేవరాజ్ రెడ్దితో తిరగడంపై శ్రావణి కుటుంబ సభ్యులు, సాయి అశోక్ రెడ్డి.. వేధించారు. సాయి, అశోక్ రెడ్డి శ్రావణిని కొట్టారనే కూడా అంటున్నారు. దేవరాజ్ ని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన శ్రావణికి ఉండేది. కానీ ఆయన నో చెప్పడం… సాయి, అశోక్ రెడ్డి, కుటుంబ సభ్యుల వేధింపులని తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఇక సాయి ఏ1, అశోక్ రెడ్డిపై ఏ2, దేవరాజ్ ఏ3లుగా కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.