వైరల్ : ప్రభాస్ స్టయిలీష్ లుక్

బాహుబలి ప్రభాస్ కొత్త లుక్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రెండీ డ్రెస్ లో బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని కూర్చొని డార్లింగ్ ఇచ్చిన పోజ్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. డార్లింగ్ కొత్త లుక్ కేక అని చెప్పుకొంటున్నారు.

ప్రసుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి రాథాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని చెబుతున్నారు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా ఉండనుంది. ఇదో సైన్స్ ఫిక్షన్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనుంది.

ఇక ప్రభాస్ నటించనున్న స్ట్రయిట్ బాలీవుడ్ చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్  దర్శకత్వం వహించనున్నారు.  రామయణ యుద్దకాండగా ఆదిపురుష్ తెరకెక్కనుంది.  ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్  కనిపిస్తారు. సీత పాత్రలో ఎవరు కనిపించనున్నారన్నది తెలియాల్సి ఉంది.