మేఘా ఆకాష్.. కొత్త యాంగిల్ !


యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్ ప్రేక్షకులని మాయలో ముంచేసింది. ఆమె తాజాగా కొత్త ఫోటోలని షేర్ చేసింది. చీరకట్టులో నిండైన అందాలతో ఆకట్టుకుంది. అలాగని ఇది ప్రత్యేకంగా చేసిన ఫోటో షూట్ కాదు. ఇంట్లో ఐఫోన్ తో తీసిన ఫోటోలు. ఇన్నాళ్లు మేఘాని చూడని కొత్త యాంగిల్ ని చూపించారు. చీరకట్టులో నిండైన అందాలతో ఆకట్టుకుంటోంది మేఘా.

లై, ఛల్ మోహనరంగా సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది మేఘా ఆకాష్. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు సినిమాలేవీ లేవ్. అయితే మెగా హీరోయిన్ నిహారిక చేయాల్సిన తమిళ్ సినిమా ఒకటి మేఘా ఆకాష్ కి అవకాశం దక్కింది. హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యం ఉన్న కథ అది. ఆ సినిమా తనకి మంచి పేరు తీసుకొస్తుందనే ఆశతో మేఘా ఉంది.