మరో 40 కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. అన్ లాక్ 4 భాగంగా రైల్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 12 నుంచి రైల్వేశాఖ 80 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తాజాగా వీటికి అదనంగా మరో 40 సమాంతర రైళ్లను నడుపనున్నారు. రైల్వే శాఖ నిర్దేశించిన సమయంలో ఇవి పరుగులు పెట్టనున్నాయి. వీటిలో ప్రయాణించాలంటే ముందుగా రిజర్వేషన్‌ తప్పనిసరి. తక్కువ స్టాపుల్లో ఆపడం వీటి ప్రత్యేకత.

ఈ కొత్త రైళ్లతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ప్రయోజనం కలగనుంది. వీటిల్లో బెంగళూరు నుంచి దనాపూర్, దనాపూర్ నుంచి బెంగళూరు వెళ్లే రైళ్లు విజయవాడ, వరంగల్ స్టేషన్లలో ఆగనున్నాయి. అలాగే సికింద్రాబాద్‌ నుంచి దనాపూర్‌, దనాపూర్‌ నుంచి సికింద్రాబాద్‌కూ ఈ క్లోన్‌ రైళ్లు నడవనున్నాయి. ఇవి బలార్షా, నాగ్‌పూర్‌, జబల్‌పూర్‌, ప్రయాగ్‌రాజ్‌ మీదుగా వెళ్లనున్నాయి.