హీరోతో పడుకుంటేనే సినిమా ఛాన్సులు : కంగనా

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.సిని పరిశ్రమకు చెందిన ఎంపీ రవి కిషన్‌ బాలీవుడ్‌ పరిశ్రమలో ఆత్మహత్యలు జరగకుండా చూడాలని పార్లమెంట్‌లో కోరిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. డ్రగ్‌ మాఫియాకు సంబంధించి పూర్తిగా విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. చైనా, పాకిస్తాన్‌ నుంచి భారతదేశానికి డ్రగ్స్‌ వస్తుందని ఆయన ఆరోపించారు. దీనిపై స్పందించిన జయాబచ్చన్‌ రవికిషన్‌ పేరు ప్రస్తావించకుండానే సినీ పరిశ్రమలో ఉన్న కొంతమంది వ్యక్తులే పరిశ్రమ పరువు తీస్తున్నారంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో జయా బచ్చన్ పై కంగనా ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

‘సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ చేసే అవకాశం రావాలన్నా, రెండు నిమిషాల సీన్‌లో నటించచాలన్నా కూడా వారు హీరోతో గడపాల్సి వుంటుంది. అలాంటి వాళ్లకే రోల్స్ ఇస్తారు’ అంటూ సంచలన ట్విట్ చేసింది కంగనా.  అంతేకాదు.. జయాబచ్చన్‌, సినీ పరిశ్రమ ఆర్టిస్టులకు ఏం ఇచ్చాయి ? రెండు నిమిషాల పాత్ర కోసం హీరోతో గడిపితేనే అవకాశాలు ఇవ్వడమా? అంటూ ఎద్దేవా చేశారు.