రష్యా వాక్సిన్ ట్రయల్స్ ఫలితాలు : సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయ్.. కానీ !
ప్రపంచంలోనే కరోనాకి తొలి వాక్సీన్ (స్పుత్నిక్-వి) ని రష్యా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయ్. మొత్తం 40వేల వాలంటీర్లకి వాక్సిన్ ని ఇచ్చారు. తాజాగా ఫేజ్-2 సంబంధించిన ట్రయల్స్ ఫలితాలని రష్యా ప్రభుత్వం విడుదల చేసింది.
ఫేజ్ 2 ట్రయల్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. కానీ అవి స్వల్ప స్థాయిలో ఉన్నట్టు తెలిపింది. ప్రతి 7గురిలో ఒకరిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న అందరిలోనూ రోగ నిరోధక శక్తి పెరగగా, నీరసం, కండరాల నొప్పి వంటి స్వల్ప అనారోగ్య సమస్యలు కనిపించాయన్నారు. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న 24 గంటల తరువాత నుంచి అప్పుడప్పుడూ శరీర ఉష్ణోగ్రత స్వల్పంగా పెరిగిందని తెలిపారు.