కష్టాల్లో చెన్నై అప్పుడే 2 వికెట్లు

163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఆరంభంలోనే కష్టాల్లో పడింది. తొలి రెండు ఓవర్లు పూర్తికాకముందే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు వాట్సాన్ (4), మురళీ విజయ్ (1) పెలివియన్ చేరారు. ప్రస్తుతం చెన్నై 2.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 8 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం రాయుడు, డుప్లెసిస్ చెరో పరుగుతో క్రీజులో ఉన్నారు.

ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. ప్రారంభంలో ముంబై దూకుడుగా ఆడినా.. ఆటకు ముందుకు వెళ్లేకొద్దీ చెన్నై పట్టు బిగించింది. వరుస వికెట్లతో ముంబైని ఒత్తిడిలోని నెట్టింది. భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేయగలిగింది. చెన్నై ఆఖరి 5 ఓవర్లలో 36 పరుగులు  ఇచ్చి 4 వికెట్లు తీసింది. ముంబై ఆటగాళల్లో తివారీ 42 టాప్ స్కోరర్ గా నిలిచారు. చెన్నై బౌలర్లలో Ngidi (3/38) Deepak Chahar (2/32) వికెట్లు తీశారు.