తొలి విజయం చెన్నైదే !
ఐపీఎల్-13ని చెన్నై సూపర్ కింగ్స్ గెలుపుతో మొదలెట్టింది. ముంబైతో జరిగిన మొదటి మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబై ఇండియన్స్ నిర్థేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు ఉండగానే చెన్నై చేధించింది. చెన్నై ఆటగాళ్లలో తిరుపతి రాయుడు 71, డిప్లెసిస్ 58 పరుగులతో గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఆఖరులో సామ్ కర్జన్ కేవలం 5 బంతుల్లో 18 పరుగులతో మెరిశాడు. ఇక దాదాపు 438 రోజుల తర్వాత మైదానంలోకి దిగిన ధోని రెండు బంతులు ఆడి ఖాతా కూడా తెరవలేదు. ఈలోపు డుప్లెసిస్ టార్గెట్ పూర్తి చేశారు.
అంతకు ముందు టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. ప్రారంభంలో ముంబై దూకుడుగా ఆడినా.. ఆటకు ముందుకు వెళ్లేకొద్దీ చెన్నై పట్టు బిగించింది. వరుస వికెట్లతో ముంబైని ఒత్తిడిలోని నెట్టింది. భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేయగలిగింది. చెన్నై ఆఖరి 5 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసింది. ముంబై ఆటగాళల్లో తివారీ 42 టాప్ స్కోరర్ గా నిలిచారు. చెన్నై బౌలర్లలో Ngidi (3/38) Deepak Chahar (2/32) వికెట్లు తీశారు.