కాంగ్రెస్’కు పవన్ బంఫర్ ఆఫర్
టీ-కాంగ్రెస్’కు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తాను కాంగ్రెస్’కు సపోర్టు చేస్తా. కానీ, ఓ కండీషన్. బీసీ నేత వీహెచ్ హనుమంతరావుని వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మాత్రమేనని ఆఫర్ చేశారు. ఈ ఆఫర్ పవన్ ఏ ఉద్దేశంతో చేశారో గానీ.. టీ-కాంగ్రెస్ నుంచి మాత్రం అరుపులు, కేకలు మొదలయ్యాయి.
పవన్ ఏమైనా రాహుల్ గాంధీనా ? ఆయన చెప్పంగనే వీహెచ్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిని చేయడానికి. గదేం లేదు అంటూ స్పందించారు ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి. ఇక, కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి, జానా రెడ్డి… తదితర నేతలు బయటికి కక్కకపోయినా లోపల పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారమ్. మొత్తానికి.. పవన్ తెలంగాణలో రెడ్ల ఆధిపత్యాన్ని టచ్ చేసినట్టు కనబడుతోంది. గతంలో బీసీ నేత, మున్నూరు కాపు నేత పొన్నాల లక్ష్మయ్యని టీ-పీసీసీ నేతగా నియమిస్తే.. ఈ రెడ్ల నేతలంతా కలిసి ఆయన కుర్చి లాగారు. ఇందులో వీహెచ్ కూడా చేయ్యేశాడనుకోండీ.. !