ఈరోజు నుంచి తెరచుకోనున్న స్కూల్స్

కరోనా లాక్‌డౌన్ తో విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. దాదాపు ఆర్నెళ్లుగా స్కూల్స్ బంద్ అయ్యాయ్. అయితే అన్ లాక్ 4లో భాగంగా కేంద్రం స్కూల్స్ రీ ఓపెనింగ్ కి షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈరోజు (సెప్టెంబర్ 21) నుంచి పలు రాష్ట్రాల్లో స్కూల్స్ తిరిగి తెరచుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్, అస్సాం, హర్యాన, జమ్మూ కాశ్మీర్‌, కర్నాటక, పంజాబ్‌ సహా పలు ఇతర రాష్ట్రాలు, యూటీలు నేటి నుంచి పాక్షికంగా పాఠశాలలు పునరుద్ధరించాలని నిర్ణయించాయి. అయితే  ఢిల్లీ, గుజరాత్‌, కేరళ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలు మాత్రం అప్పుడే స్కూల్స్ తెరవమని‌ ప్రకటించాయి.

ఇక స్కూల్స్ తెరిచిన రాష్ట్రాలు కేంద్రం జారీ చేసిన గైడ్ లైన్స్ ని తప్పక పాటించాల్సి ఉంటుంది. విద్యార్థులు పాఠశాలకి రావాలంటే.. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. పాఠశాలకు రానివారు ఆన్ లైన్ క్లాసులు వినే ఆప్షన్ ని కల్పించింది.ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలని సూచించింది. ఫేస్‌ మాస్క్‌ ధరించడం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం తదితర నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కంటైన్‌మెంట్‌ జోన్లలో పాఠశాలలు మూసే ఉండనున్నాయి. ఇక తెలంగాణలో ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమై 20 రోజులు అవుతున్నందున పాఠాల వారీగా వర్క్‌షీట్ల పంపిణీ, వాటి ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని టీచర్లను ఆదేశించారు.