డ్రగ్స్ కేసు : సారా, శ్రద్దాలకు సమన్లు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో కాలికి తగిలిన తీగ డ్రగ్స్ కేసు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు పలువురిని ఎన్ సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే విచారణలో పలువురు ప్రముఖుల పేర్లని బయటపెట్టింది. ఈ లిస్టులో హీరోయిన్స్ శ్రద్దా కపూర్, సారా అలీఖాన్ లకి త్వరలోనే సమన్లు జారీ చేసి.. విచారించేందుకు ఎన్ సీబీ అధికారులు రెడీ అవుతున్నట్టు సమాచారమ్.
ఇక సుశాంత్ కేసు విచారణలో పలువురు హీరోయిన్స్ సుశాంత్ వ్యవసాయ క్షేత్రంలో జరిగే డ్రగ్స్ పార్టీకి హాజరయ్యేవారని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ లిస్టులో రియాతో పాటుగా సారా అలీఖాన్, శ్రద్దా కపూర్ పేర్లు వినిపించాయి. ఇప్పుడు వీరిద్దరికి ఎన్ సీబీ అధికారులు సమన్లు పంపించేందుకు రెడీ అవుతున్నారు. ఇదే కేసులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీంత్ సింగ్ పేరు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె బాలీవుడ్ ఇటీవలే అడుగుపెట్టింది. కాబట్టి.. డ్రగ్ కేసులో ఆమె ప్రమేయం ఉండక పోవచ్చని చెబుతున్నారు.
సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్ (34) జూన్ 14న ముంబయిలోని తన అపార్ట్మెంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రియా చక్రవర్తి తన కుమారుడిని మానసికంగా వేధించిందని, బ్యాంకు ఖాతా నుంచి కోట్లలో డబ్బు బదిలీ చేసుకుందని నటుడి కుటుంబం కేసు వేసింది. అనంతరం రంగంలోకి దిగిన సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఎన్సీబీ దర్యాప్తును ముమ్మరం చేశాయి. రియా వాట్సాప్ చాట్‌లో మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా లాంటి పలు విషయాలు బయటపడటంతో ఆమెను ఎన్సీబీ అరెస్టు చేసింది.