దారుణం : ఫేస్ బుక్ లైవ్’లో ‘పద్మావత్’ సినిమా

ఎనో వివాదాలు, అడ్డంకుల మధ్య ‘పద్మావత్’ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. ఐతే, ఇప్పుడీ సినిమాపై పైరసీ దెబ్బ పడేలా ఉంది. రిలీజ్ రోజునే పద్మావత్ సినిమాని ఫేస్ బుక్ పేజీ లైవ్ లో ప్రసారమయ్యింది. ‘జాతోంకా అడ్డా’ అనే ఫేస్‌బుక్ పేజీ ప‌ద్మావ‌త్ సినిమాను ఫేస్‌బుక్‌లో లైవ్ ద్వారా ప్ర‌సారం చేసింది. ఇప్ప‌టికే దాదాపు 15వేల మందికి పైగా నెటిజ‌న్లు ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. అంతేకాకుండా మూడున్న‌ర‌ ల‌క్ష‌ల మందికి పైగా ఈ లైవ్‌ను వీక్షించారు. ఇంతకంటే దారుణం మరోటి ఉండదేమో.. !

ఇప్పటికే రాజ్ పుత్ కర్ణిసేన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో పద్మావత్ ఆడటం లేదు. మిగితా థియేటర్స్ కు కర్ణిసేన ఆందోళనలని దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీ ఆడియెన్స్ రావడం లేదు. దీనికితోడు.. రిలీజ్ రోజునే పద్మావత్ సినిమాని ఫేస్ బుక్ లో లైవ్ కావడం పెద్ద దెబ్బే అని చెప్పాలి. దీనిపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి