సర్ రైజర్స్ టార్గెట్ 164

దుబాయ్ వేదికగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు,సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి సన్‌రైజర్స్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అరంగేట్రం మ్యాచ్ లోనే యువ ఆటగాడు దేవదత్ పాడికల్ 56 (42 బంతుల్లో) అదరగొట్టేశాడు. అతడికి తోడు డివిలియర్స్ 51 (30 బంతుల్లో) రాణించడంతో ఆర్ సీబీ 163 పరుగులు చేయగలిగింది.

ఈ పిచ్ పై 164 లక్ష్యాన్ని చేధించడం అంత ఈజీ ఏమీ కాదు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా.. వికెట్లు కాపాడుకుంటే.. టార్గెట్ ని చేధించవచ్చని చెబుతున్నారు. అయితే ఈ మ్యాచ్ ని గెలిచిన టోర్నీని ఘనంగా ప్రారంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.