ఐపీఎల్13 : తొలి మ్యాచ్’లో సన్ రైజర్స్ ఓటమి

ఐపీఎల్13 తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు నిరాశే ఎదురైంది. హైదరాబాద్ పై బెంగళూరు 10 పరుగులతో గెలుపొందింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అరంగేట్రం మ్యాచ్ లోనే యువ ఆటగాడు దేవదత్ పాడికల్ 56 (42 బంతుల్లో) అదరగొట్టేశాడు. అతడికి తోడు డివిలియర్స్ 51 (30 బంతుల్లో) రాణించడంతో ఆర్ సీబీ 163 పరుగులు చేయగలిగింది.

164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఆరంభంలో బాగానే ఆదింది. ఓపెనర్ వార్నర్ త్వరగానే అవుటైన.. మరో ఓపెనర్ బెన్ స్టో  61(43 బంతుల్లో), మనీష్ పాండే 34 (బంతుల్లో) బాగానే ఆడారు. అయితే బెన్ స్ట్రో అవుటయిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారింది. బెన్ స్ట్రో తర్వాత వచ్చిన విజయ్ శంకర్ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు.. ఒత్తిడికి లోనై వరుసగా పెలివియన్ చేరడంతో సన్ రైజర్స్ 19.4 ఓవర్లలో 153 పరుగులకే పరిమితం అయింది. దీంతో 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.