రాయగిరి రైల్వే స్టేషన్ ఇకపై యాదాద్రి రైల్వే స్టేషన్ !
యాదాద్రి లక్ష్మీ నరసింహా పుణ్యక్షేత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ స్థాయి క్షేత్రంగా అభివృద్ది చేస్తున్న సంగతి తెలిసిందే. యాదాద్రి ఆలయ పునర్మాణ పనులు కూడా పూర్తి కావొస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాదాద్రికి కేవలం 5 కిలో మీటర్ల దూరంలో ఉండే రాయగిరి రైల్వే స్టేషన్ పేరుని యాదాద్రి రైల్వే స్టేషన్ మారుస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. ఇకపై ఈ రూటులో వెళ్లే అన్నీ ట్రైన్స్ ఇక్కడ ఆపేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు రాయగిరి నుంచి యాదాద్రిగా పేరుమారిన రైల్వే స్టేషన్ ను కూడా కేంద్రం సాయంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు సేవలను యాదాద్రి వరకు పొడగించే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నది. హైదరాబాద్ నుంచి భక్తులు యాదాద్రికి చాలా తక్కువ టైమ్ లో చేరుకునేలా అన్నీ రకాల ఏర్పాట్లు చేస్తోంది.. తెలంగాణ ప్రభుత్వం.