గుడ్ న్యూస్ : ఒక్కరోజులోనే లక్ష మంది కోలుకున్నారు
దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కేసుల నమోదవుతున్న జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. మరికొద్దిరోజుల్లో అగ్రరాజ్యం అమెరికాని వెనక్కి నెట్టి భారత్ అగ్రస్థానానికి చేరుకునే ఉంది. అయితే అదే సమయంలో రికవరీలోనూ భారత్ ప్రపంచంలోనే టాప్ లో ఉంది. నిన్న ఒక్కరోజే లక్ష మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 75,083 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55,62,663కు చేరింది. వీరిలో ఇప్పటికే 44లక్షల 97వేల మంది కోలుకోగా, మరో 9లక్షల 75వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే రికార్డుస్థాయిలో లక్షకు (1,01,468) పైగా కరోనారోగులు కోలుకున్నారు. నిన్న మరో 1053 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనా సోకి మృతిచెందిన వారిసంఖ్య 88,935కు చేరింది. దేశంలో రికవరీ రేటు 80శాతం దాటింది. మరణాల రేటు 1.6శాతంగా ఉంది.